Header Banner

డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై లోకేష్ కీలక ప్రకటన! ఎస్సీ వర్గీకరణపై లోకేశ్ క్లారిటీ..

  Tue Mar 04, 2025 12:49        Politics

ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై శాస‌న మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు ఈరోజు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి చూస్తే.. 2,60,194 పోస్టులు భర్తీ చేశారు. అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేయడం జరిగింది.

 

ఇది కూడా చదవండి: రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

ఒక్క టీడీపీ హయాంలోనే 70 శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డీఎస్సీ ఫైల్ పైనే మొదటి సంతకం చేశాను. అందులో భాగంగానే 02-07-24 తేదీన టెట్ నిర్వహించడం జరిగింది. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 1.87 లక్షల మంది అర్హత సాధించారు. 03-10-24 నుంచి 21-10-24 వరకు టెట్ పరీక్షను పూర్తిచేయడం జరిగింది. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని భావిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నా. ప్రతిపక్ష పార్టీ నేతలు నా శాఖకు సంబంధించి ప్రశ్నలు వేసి.. చర్చించేందుకు సిద్ధంగా లేరని, ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #DSC #AndhraPradesh #APOlitics #jobsNotification #News